‘అంబాల’ షూటింగులో విశాల్ కు గాయాలు

‘అంబాల’ షూటింగులో విశాల్ కు గాయాలు

Published on Nov 28, 2014 1:06 AM IST

vishal
‘అంబాల’ సినిమా షూటింగులో హీరో విశాల్ గాయపడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీలో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో వైరు తెగి పడింది. దాంతో విశాల్ కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే దగ్గరలో హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వయంగా విశాల్ నిర్మిస్తున్నారు. హన్సిక హీరోయిన్.

సినిమా షూటింగులో విశాల్ గాయపడడం ఇది తొలిసారి కాదు. గతంలో ‘పూజ’ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాలు చిత్రికరిస్తున్నప్పుడు రెండు సార్లు విశాల్ కు గాయాలయ్యాయి. రిస్కీ ఫైట్స్ చేయడానికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు