‘అవును 2’కి హైలైట్‌గా.. పూర్ణ!

‘అవును 2’కి హైలైట్‌గా.. పూర్ణ!

Published on Apr 1, 2015 8:19 AM IST

avunu-2
విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తాజాగా రూపొంందిన సినిమా ‘అవును 2’. 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన అవును సినిమాకు రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. హర్షవర్ధన్ రానే, పూర్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేశారు దర్శకుడు రవిబాబు. అవును సినిమాకు రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కిందని, అవును ఫీల్‌ను ఏమాత్రం మిస్ చేయకుండా ఈ సినిమా ఉండనుందని తెలిపారు. అవును సినిమాలో హీరోయిన్‌గా నటించిన పూర్ణ, అవును 2లోనూ కొనసాగిందని రవిబాబ్ అన్నారు. ఈ సినిమాకు ఆమె నటన ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. ఈ పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందని తెలిపారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు సురేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు