తెలుగులోనూ వస్తోన్న అదాశర్మ హిందీ సినిమా!

తెలుగులోనూ వస్తోన్న అదాశర్మ హిందీ సినిమా!

Published on Jan 22, 2017 6:25 PM IST

comanndor2
‘1920’ అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అదా శర్మ, ఆ తర్వాత తెలుగు పరిశ్రమకూ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో మెప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆమె మళ్ళీ బాలీవుడ్ వెళ్ళిపోయి చేసిన సినిమాయే ‘కమాండో 2’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో విలన్‌గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో అదా శర్మ ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారట. ఇక హిందీలో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేస్తున్నారు.

‘కమాండో 2’ పేరుతోనే తెలుగు, తమిళంలో డబ్ అవుతోన్న ఈ సినిమా మార్చి 3న విడుదలవుతోంది. ఈ సినిమాలో హైద్రాబాద్‌కు చెందిన భావన రెడ్డి అనే అమ్మాయిగా అదా శర్మ కనిపించనున్నారు. దేవన్ భోజాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు