ప్రతి ఒక్కరిని మెప్పించిన ఆదర్శ్..

ప్రతి ఒక్కరిని మెప్పించిన ఆదర్శ్..

Published on Oct 1, 2014 10:00 PM IST

Aadarsh
కృష్ణవంశి కొత్త సినిమా విడుదలైన ప్రతిసారి.. ఆ సినిమాలో నటించిన నటినటులు మంచి గుర్తింపు సొంతం చేసుకుంటారు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో రామ్ చరణ్ నటనకు అద్బుతమైన ప్రసంశలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర చేసిన మరో నటుడు ఆదర్శ బాలకృష్ణ కూడా మంచి నటన కనబరిచాడు అంటూ విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ టాలెంటెడ్ యాక్టర్.. ‘గోవిందుడు అందరివాడేలే’లో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, రఫ్ షేడ్స్ ఉన్న మేనరిజమ్స్.. ఇలా ప్రతి ఒక్క అంశంలో ఆదర్శ్ పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర పోషించిన ఆదర్శ్, ఆ సన్నివేశాలలో రామ్ చరణ్ కు కాంపిటీషన్ గా నిలిచాడు. తన క్యారెక్టర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

హిందీ చిత్ర పరిశ్రమ నుండి విలన్ పాత్రల కోసం నటులను దిగుమతి చేసుకుంటున్న ఈ సమయం ఒక తెలుగు కుర్రాడిలో ఇంత మంచి నటుడు ఉన్నాడు అని వెలికితీసిన ఘనత దర్శకుడు కృష్ణవంశిదే. విలన్ పాత్రలలో తాను అద్భుతంగా నటించగలనని ఆదర్శ్ నిరూపించుకున్నాడు. అతనికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు