మరో మెగా హీరోకి కూడా ఆ హీరోనే విలన్ ?

AadiAdi Pinisetty villain for another Mega hero
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘విన్నర్’ కూడా ఒకటి. ఈరోహు ఏజ్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో విలన్ గా హీరో ఆది పినిశెట్టిని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ఆది మొదట ‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. కానీ ఇక్కడ సరైన సక్సెస్ అందుకోలేకపోయిన ఆయన తమిళ పరిశ్రమ పై దృష్టి పెట్టి అక్కడ బాగానే క్లిక్ అయ్యాడు.

అయినా కూడా పట్ట్టు విడవని ఆది హీరోగా కాకపొతే మంచి నటుడిగా అయినా గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో కాస్త ట్రాక్ మార్చుకుని అల్లు అర్జున్ చివరి చిత్రం ‘సరైనోడు’ లో నెగెటివ్ క్యారెక్టర్ ను పోషించాడు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఆది చేసిన ‘వైరం ధనుష్’ పాత్ర తెలుగు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్టయ్యింది. దీంతో కొన్ని ప్రత్యేక పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ధరమ్ తేజ్ ‘విన్నర్’ లోనే గాక నాని చేస్తున్న ‘వీడు లోకల్’ చిత్రంలో సైతం ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

Bookmark and Share