ఇంకా పూర్తికాని ‘అదిరింది’ సెన్సార్ పనులు !

ఇంకా పూర్తికాని ‘అదిరింది’ సెన్సార్ పనులు !

Published on Oct 18, 2017 12:48 PM IST


తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతొ రిలీజ్ కానుంది. ముందుగా తమిళంతో పాటే తెలుగులో కూడా ఈరోజే రిలీజ్ చేయాలనుకోగా కొన్ని కారణాల వలన సడి కాస్త వాయిదాపడింది. దాంతో కొత్త తేదీగా దీపావళి రోజు అనగా 19వ తేదీని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పటికీ తెలుగు వెర్షన్ యొక్క సెన్సార్ పనులైతే పూర్తికాలేదు.

దీంతో రేపు కూడా విడుదల ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం సెన్సార్ పూర్తయ్యాకే ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తామని అంటున్నారు. మరి ఏం జరగబోతోందో ఇంకొద్దిసేపట్లో తేలనుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శరత్ మరార్ సమర్పిస్తున్నారు. కాజల్, సమంత, నిత్యామీనన్లు నటించిన ఈ చిత్రంలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజే విడుదలైన ఈ సినిమా భారీ స్థాయి ఓపెనింగ్స్ పై కన్నేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు