తమిళ అర్జున్ రెడ్డికి ‘ఏ’ సర్టిఫికెట్…!

తమిళ అర్జున్ రెడ్డికి ‘ఏ’ సర్టిఫికెట్…!

Published on Nov 15, 2019 11:00 PM IST

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ ని చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. హిందీలో కబీర్ సింగ్ గా విడుదలైన ఈ మూవీ అక్కడ తెలుగుకు మించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక తమిళంలో ఈ చిత్రం ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. కాగా ఈ మూవీ నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం.

నిజానికి ఈ మూవీ ఈనెల 8న విడుదల కావాల్సిఉండగా సెన్సారు సమస్యల వలన వాయిదా వేశారు. కనీసం యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయవలసిందిగా నిర్మాతలు సెన్సార్ సభ్యులను కోరారు. అది కుదరదని వారు చెప్పిన పక్షంలో సినిమా విడుదల వాయిదా వేశారు. కానీ రెండు వారాలు విడుదల వాయిదా వేసుకొని ప్రయత్నాలు చేసినా చివరికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో నిరాశ చెందారు. ఇక ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించగా, రాధన్ సంగీతం అందించారు. ఇన్ ఈనెల 22న ఆదిత్య వర్మ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు