‘మేజర్’ పాత్ర కోసం కష్టపడుతున్న యంగ్ హీరో

‘మేజర్’ పాత్ర కోసం కష్టపడుతున్న యంగ్ హీరో

Published on Oct 15, 2019 10:35 AM IST

ఇటీవలే ‘గూఢచారి, ఎవరు’ సినిమాలతో వరుస విజయాల్ని అందుకున్న హీరో అడివి శేష్ ఆ తరహాలోనే ‘మేజర్’ అనే మరో సినిమా చేయనున్నాడు. అయితే ఈసారి వాస్తవ ఘటనల ఆధారంగా కథ ఉండనుంది. అదే 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ.

ఈ సినిమాపై శేష్ చాలా ఇష్టంగా ఉన్నాడు. అందుకే ఉన్నిక్రిష్ణన్ పాత్ర కోసం బాగా కష్టపడుతున్నాడు. రెండు భిన్నమైన లుక్స్ కోసం సుమారు 10 కిలోల వరకు బరువు తగ్గుతున్నాడట. ఇందుకోసం స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు