ఇక చిన్న సినిమాలు సందడి మొదలుకానుంది !

ఇక చిన్న సినిమాలు సందడి మొదలుకానుంది !

Published on Apr 28, 2017 6:30 PM IST

ఇన్నాళ్లు తెలుగు పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం ఎట్టకేలకు విడుదలైపోయింది. దీంతో బాహుబలికి దారి వదిలిన చిన్న సినిమాలన్నీ వరుసగా రిలీజుకు సిద్దమైపోతున్నాయి. సుమారు ఐదు సినిమాలు వరకు రాబోయే మే నెలకు ముహూర్తం కుదుర్చుకుని రెడీగా ఉన్నాయి. వాటిలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ నటించిన ‘వెంటాపురం’ ఒకటి కాగా మే 5న రానున్న శ్రీనివాస్ అవసరాల అడల్ట్ కామెడీ చిత్రం ‘ బాబు బాగా బిజీ’ మరొకటి.

అలాగే వరుస సక్సెస్లతో ఫామ్లో ఉన్న నిఖిల్ సిద్దార్థ నటించిన ‘కేశవ’ కూడా మే 12న వస్తుండగా, గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మే 19న థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. వీటితో పాటే మరొక చిత్రం ‘రక్షక భటుడు’ కూడా మే 5నే వస్తోంది. ఈ సినిమాలన్నిటి పైనా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. కేవలం 19 రోజుల వ్యవధిలో ఈ సినిమాలన్నీ దిగుతుండటంతో బాహుబలి, మరోవైపు ఈ చిన్న సినిమాలతో ఈ వేసవికి థియేటర్లన్నీ కళకళలాడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు