సౌత్ సినిమాలకి నార్త్ లో గిరాకీ పెరిగింది !

సౌత్ సినిమాలకి నార్త్ లో గిరాకీ పెరిగింది !

Published on May 31, 2017 3:55 PM IST


సౌత్ ఇండియన్ సినిమాలంటే నిన్న మొన్నటి దాకా నార్త్ పరిశ్రమలో పెద్దగా పట్టింపు ఉండేది కాదు. ఎంత మంచి సినిమా అయినా అక్కడ దక్కాల్సిన గుర్తింపు వచ్చేది కాదు. కానీ ‘బాహుబలి-ది కంక్లూజన్’ విడుదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడక్కడ దక్షిణాది సినిమా అంటే ఒక ప్రత్యేక గౌరవం దొరుకుతోంది. ఇదంతా బాహుబలి ఇచ్చిన అటెంక్షననే చెప్పాలి. బాహుబలి చేసిన మాయతో తెలుగు, తమిళ సినిమాలంటే ప్రేక్షకులకు ఒకరకమైన గురి ఏర్పడింది.

అందుకే ఇకపై రిలీజవబోయే సినిమాలపైనే కాకుండా ఇంతకు ముందు రిలీజైన పలు హిట్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లను కూడా యూట్యూబ్ లో వెతుక్కుని మరీ వీక్షిస్తున్నారు. అందుకు నిదర్శనమే అల్లు అర్జున్ ‘సరైనోడు’, అజిత్ ‘వేదాళం’. ఈ రెండు చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్ 12 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఈ ఆదరణను చూసిన పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల్ని హిందీ ప్రేక్షకుల అభిరుచికి కూడా కాస్త దగ్గరగా ఉండేలా రూపొంస్తూ ప్రాంతీయ భాషతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు