చైనా నుంచి జపాన్ కి వెళ్లనున్న ‘బాహుబలి’

చైనా నుంచి జపాన్ కి వెళ్లనున్న ‘బాహుబలి’

Published on Oct 5, 2015 12:21 PM IST

baahubali-b
ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన ఇండియన్ బిగ్గెస్ట్ పీరియడ్ ఫిల్మ్ బాహుబలి. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడంలో కూడా ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్ సాధించి అందరినీ షాకింగ్ కి గురించేసింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే హాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాహుబలి పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడుతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో రీసెంట్ గా బాహుబలి చూసిన కొరియన్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది.

ఇది కాకుండా త్వరలోనే చైనాలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. చైనా తర్వాత బాహుబలిని జపాన్ లో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్దం చేసారు. ప్రస్తుతం బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమవుతోంది. అక్కడ ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చెయ్యడానికి జపనీస్ డిస్ట్రిబ్యూటర్ అయిన ట్విన్ కో తో డీల్ ని సెట్ చేసారు. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ బాహుబలి సినిమాని చైనా, జపాన్ లలోనే కాకుండా లాటిన్ అమెరికా, జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ లలో రిలీజ్ చెయ్యడానికి అక్కడి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుతున్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు