వారణాసిలో పూర్తి చేసిన అజ్ఞాతవాసి !

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ ఇటివల వారణాసిలో టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కీలకమైన సన్నివేశాలు మరియు ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకొని యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చింది. మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈనెల 18 లేదా 19న ఆడియోను హైదరాబాద్ లో జరపబోతున్నారు. అనిరుద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో డిఫరెంట్ ఫైట్స్ తో అలరించబోతున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా పుష్కలంగా ఉన్నాయని సమాచారం. హారిక హాసిని బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 

Like us on Facebook