పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ముఖ్యమైన పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ బోర్డ్ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది.
ఇటీవలే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన దక్కగా నిన్న రిలీజైన ‘కొడకా కోటేశ్వర్ రావ్’ పాట అభిమానుల్ని ఒక ఊపు ఊపేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సైతం భారీ బిజినెస్ జరిపిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. పవన్ 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా హారికా అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబు నిర్మించారు. ఈ చిత్రంతో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు.
- ఫోటోలు : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలలో తమన్నా
- ఫోటోలు : దాదిసాహెబ్ ఫాల్కే పురస్కారాలలో అదితి రావు హైదరీ
- ఫోటోలు : ఐశ్వర్య రాయ్
- టీజర్ : నేల టిక్కెట్టు
- అభిమానులెవ్వరూ కోపం తెచ్చుకోకూడదన్న పవన్ !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.