యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్‌గా రజనీ కుమార్తె!

aishwarya
సూపర్ స్టార్ రజనీకాంత్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్, క్లాసికల్ డ్యాన్సర్‌గా, రచయితగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఐక్య రాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్)కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. మహిళల సాధికారత కోసం ఐశ్వర్యా యూఎన్‍తో కలిసి పనిచేయనున్నారు. నిన్న సాయంత్రం ఆమెను యునైటెడ్ నేషన్స్ ప్రతినిధిగా యూఎన్ అసిస్టెంట్ సెక్రెటరీ లక్ష్మి పురి ప్రకటించారు.

ఇండియన్ పాపులర్ దర్శక, నటుడు ఫర్హాన్ అక్తర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తదితరులతో కలిసి ఇండియాలో వుమెన్ ఎంపవర్‌మెంట్, జెండర్ ఈక్వలిటీకి ఐశ్వర్య పాటుపడనున్నారు. ఇక తన కూతురుకి ఇలాంటి గౌరవం దక్కడం సంతోషంగా ఉందని, తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని రజనీకాంత్ ఈ సందర్భంగా అన్నారు.

 

Like us on Facebook