పూరికి సహాయకుడిగా వర్క్ చేస్తున్న వారసుడు

పూరికి సహాయకుడిగా వర్క్ చేస్తున్న వారసుడు

Published on Feb 10, 2016 11:28 AM IST

Akash-Puri
పూరి జగన్నాధ్ తనయుడైన ఆకాష్ పూరి బాల్య నటుడిగా పలు సినిమాలు చేసాడు. ఆ తర్వాత ”ఆంధ్రా పోరి” సినిమాతో రాజ్ మాదిరాజు దర్శ కత్వంలో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి చిత్రం తోనే తన నటనతో, డాన్స్ లతో ఆకట్టుకున్నాడు. ఆకాష్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే కొన్ని సినిమాల్లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు.

కానీ ఇప్పుడు తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’ సినిమాకి తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు. ఇంతవరకు నటుడిగానే తెర పైన కనిపించిన ఆకాష్ ఇకపై తెరవెనుక కూడా పనిచేస్తాడన్నమాట. ఇలా పనిచేయడం వల్ల తనకు సినిమా రూపొందించడంలో గల కష్టనష్టాలను తన తండ్రి అయిన పూరి జగన్నాధ్ దగ్గర నుంచి చూసి తెలుసుకునే అవకాశం ఆకాష్ కలిగింది. కన్నడ నిర్మాత సి. ఆర్. మనోహర్ అన్న కుమారుడు ఇషాన్ ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు. ప్రియాంక చోప్రా కజిన్ అయిన మన్నార చోప్రా కథానాయిక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు