నాని నుండి చాలా నేర్చుకోవాలంటున్న యంగ్ హీరో !
Published on Jul 9, 2017 4:15 pm IST


గత శుక్రవారం విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రంతో నాని పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. మొదటి రోజు మొదటి షోతోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు నాని కథల్ని ఎంచుకుంటున్న తీరును, నటనలో చూపుతున్న పరిణితిని తెగ అభినందిస్తున్నారు. టాప్ సినీ సెలబ్రిటీలు సైతం నానిని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు.

అలాంటి సెలబ్రిటీల లిస్టులో అక్కినేని యువ హీరో అఖిల్ కూడా చేరారు. తాజాగా సినిమాను వీక్షించిన ఆయన నానికి శుభాకాంక్షలు చెబుతూ నాని నువ్వు హిట్ సక్సెస్ మిషన్ అయ్యావని, నిజంగా నీ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని అన్నారు. నూతన దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ త్రి యాంగిల్ లవ్ స్టోరీని డివివి దానయ్య నిర్మించారు.

 
Like us on Facebook