ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఆగిపోలేదట !

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఆగిపోలేదట !

Published on Sep 28, 2016 7:00 PM IST

akhil-hanu-raghavapudi
అక్కినేని నట వారసుడిగా ‘అఖిల్’ సినిమాతో బ్రహ్మాండమైన ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని అఖిల్ మొదటి ప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూశాడు. దీంతో తన తరువాతి సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. ఎంతలా అంటే పరిశ్రమలో ఉన్న ఒకరిద్దరు టాప్ దర్శకులు మినహా అందరినీ కాచి వడపోశాడు. ఈ ప్రయత్నంలో మొదట కళ్యాణ్ కృష్ణని ఎంచుకున్నాడు, కానీ తరువాత కాదనుకుని హను రాఘవపూడిని దాదాపు ఖాయం చేసేసుకుని, ట్విట్టర్లో ప్రకటన కూడా చేశాడు. హను కూడా స్క్రిప్ పని మొత్తం ఫినిష్ చేసి షూటింగ్ కి రెడీ అయ్యాడు. చివరికి అతన్ని కూడా పక్కనబెట్టి విక్రమ్ కుమార్ కు ఫిక్సయ్యాడు అఖిల్.

కానీ హను రాఘవపూడితో సినిమా తీయాలన్న ఆలోచనను అఖిల్ తాత్కాలికంగా మాత్రమే పక్కనబెట్టాడని, త్వరలో సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న విక్రమ్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది ప్రారంభమైన కొద్దిరోజులకే హను సినిమాని కూడా పట్టాలెక్కిస్తాడట అఖిల్. కానీ ఈ వార్తపై అఖిల్ గాని, హను రాఘవపూడి గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. సో వెరీ సినిమా అండా లేదా అనేది ఖచ్చితంగా తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు