ఫేమస్ లొకేషన్లలో షూట్ చేయనున్న అఖిల్ అండ్ టీమ్ !

ఫేమస్ లొకేషన్లలో షూట్ చేయనున్న అఖిల్ అండ్ టీమ్ !

Published on May 8, 2017 8:39 AM IST


అక్కినేని అఖిల్ తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. స్వయంగా అక్కినేని నాగార్జున పూర్తి శ్రద్ద తీసుకుని నడిపిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై సినీ వర్గాల్లో, అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గత ఏప్రిల్ నెల 4 వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్లలో ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేసిన యూనిట్ ఇండియాలోని పలు ఫేమస్ లొకేషన్లకు వెళ్లారు.

నార్త్ ఇండియాలోని అలహాబాద్, ఆగ్ర, లక్నో వంటి ప్రాంతాలు ఆ లొకేషన్ల జాబితాలో ఉన్నాయి. అక్కడే పలు కీలకలమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ ను ఈ చిత్రంలో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేయిస్తున్నారు. అఖిల్ కూడా ప్రాజెక్ట్ కోసం వర్కవుట్స్ చేస్తూ బాడీ లుక్ మార్చుకుంటున్నాడు. ఇకపోతే ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే క్లాసీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు