అఖిల్ సినిమా విడుదల తేదీ ఖరారు

అఖిల్ సినిమా విడుదల తేదీ ఖరారు

Published on Aug 1, 2015 10:41 AM IST

Akhil
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, అఖిల్‌ను పరిచయం చేసే బాధ్యతను చేపట్టారు. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మించడం విశేషం. ఇప్పటికే స్పెయిన్, హైద్రాబాద్, థాయ్ ల్యాండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం 70%పైనే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ మధ్యే పూర్తైన థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న టీం, మళ్ళీ ఆగష్టు 4నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. అఖిల్ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉండగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా రూపొందుతున్నట్లు నితిన్, వి.వినాయక్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ చిత్ర యూనిట్ ఆడియో, సినిమా రిలీజ్ డేట్‌లను ఖరారు చేసేశారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ఆడియో ఆవిష్కరణ వేడుకను జరపనున్నారు. ఇక అక్టోబర్ 21న సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇప్పట్నుంచే పలు ఏరియాలకు సంబంధించి ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు