Like us on Facebook
 
అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !

akhil
అక్కినేని అఖిల్ తన రెండవ సినిమా కోసం చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాని మొదలువులేడదామా అని అనుకుంటున్నాడు. మొదటి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ చాలా డిస్కషన్ల తరువాత ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ తో సినిమాని ఓకే చేశాడు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ మధ్యే వివాహం చేసుకోని కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సినిమా పనులు మొదలుపెట్టాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో స్క్రిప్ట్ కు సంబందించిన పనులు జరుగుతున్నాయి. నాగార్జునగారి సలహాల మేరకు కథకు చివరి హంగులు దిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ కుమార్. ఈ పనులన్నీ పూర్తై పూర్తిస్థాయి స్క్రిప్ట్ తయారయ్యేసరికి డిసెంబర్ నెలాఖరు అవుతుందని, ఆ వెంటనే జనవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో అఖిన్ సరసన కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Bookmark and Share