నటుడిగా ఫుల్ మార్కులు కొట్టేసిన అఖిల్ !
Published on Dec 24, 2017 3:13 pm IST

అఖిల్ హీరోగా రూపొందిన ‘హలో’ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి ప్రసంశలు అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా అని చోట్ల చిత్రం బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఇక మొదటి సినిమాతో మెప్పించలేకపోయిన అఖిల్ ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరం పాటు కష్టపడి అన్ని అంశాల్లోనూ మెరుగైన ప్రదర్శన ఇచ్చారు.

అటు డ్యాన్సుల్లోను, నటనలోనూ పరిణితి కనబర్చిన అఖిల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. ఇక ఆయనే సొంతగా పాడిన ‘ఏవేవో కలలు కన్నా’ పాట ఆల్బమ్ లోని బెస్ట్ సాంగ్ లో ఒకటిగా నిలిచింది. ఇలా అన్ని విభాగాల్లోనూ పూర్తస్థాయి నటుడిగా కనిపించిన అఖిల్ కు అటు ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు, సినీ పెద్దల నుండి ఫుల్ మార్కులు అందేశాయి. ఈ చిత్రం ఇచ్చిన ఫలితం ఇకపై అఖిల్ నుండి మంచి సినిమాలే వస్తాయనే నమ్మకాన్ని కలిగించింది.

 
Like us on Facebook