‘అఖిల్’ గా దూసుకు రానున్న అక్కినేని అఖిల్

‘అఖిల్’ గా దూసుకు రానున్న అక్కినేని అఖిల్

Published on Aug 27, 2015 4:50 PM IST

akhil
భారీ అంచనాల నడుమ అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం యంగ్ హన్డ్సం హీరో అఖిల్ అక్కినేని. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టాలీవుడ్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న అఖిల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజులు ఈ సినిమా టైటిల్ పై పలు రూమర్స్ ఉన్నా అధికారిక ప్రకటన లేదు. తాజాగా ఈ చిత్ర నిర్మాత నితిన్ ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. అఖిల్ మొదటి సినిమాకి ‘మిస్సైల్’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. అఖిల్ మొదటి సినిమాకే తన పేరే వచ్చేలా టైటిల్ ని ఫిక్స్ చేయడం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అలాగే ‘ది పవర్ అఫ్ జుఆ’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ‘జుఆ’ అంటే గేమింగ్ అని అర్థం వస్తుంది.

అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా అఖిల్ లుక్ అండ్ మాస్ అప్పియరెన్స్ అదిరిపోయేలా ఉండడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అంతే కాకుండా మరో రెండు రోజుల్లో నాగార్జున బర్త్ డే కానుకగా ఆగష్టు 29న రిలీజ్ కానున్న ఫస్ట్ టీజర్ పై అంచనాలను పెంచేసింది. సెప్టెంబర్ మిడిల్ కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే కానుకగా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మెలోడీ టచ్ – మాస్ బీట్ ఏదీ మిస్ కాకూడదని అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నారు. అఖిల్ సరసన హీరోయిన్ గా చేస్తున్న సయేషా సైగల్ కి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు