నేడే అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.!

నేడే అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.!

Published on Aug 27, 2015 12:47 PM IST

Akhil
‘మనం’ సినిమాలో చేసిన ఒక్క నిమిషం గెస్ట్ రోల్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అక్కినేని అఖిల్. చిన్న బిట్ సీన్ తోనే వచ్చిన క్రేజ్ వల్లే అఖిల్ నటిస్తున్న మొదటి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నితిన్ తన హోం బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కోసం తెలుగు సినీ లవర్స్ తో పాటు, సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.

తాజాగా నితిన్ అక్కినేని అభిమానులకి ఒక శుభవార్త తెలియజేశాడు. అదే అఖిల్ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నామని తెలియజేశాడు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. అలాగే నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఆగష్టు 29న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు