తమిళ హీరోకి అక్కినేని హీరో ఆతిథ్యం

తమిళ హీరోకి అక్కినేని హీరో ఆతిథ్యం

Published on Oct 16, 2019 3:56 PM IST

యంగ్ హీరో అక్కినేని అఖిల్ తమిళ హీరో శివ కార్తికేయన్ మరియు దర్శకుడు పి ఎస్ మిత్రన్ కు నిన్న తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్ ఓ మూవీ విషయమై హీరో శివ కార్తికేయన్, దర్శకుడు మిత్రన్ తో పాటు సినిమాటోగ్రాఫర్ జార్జి విలియమ్స్ రాగా అఖిల్ వారిని ఇంటికి డిన్నర్ కి పిలవడం జరిగింది. శివ కార్తికేయన్ ప్రస్తుతం పి ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న హీరో చిత్రంలో నటిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వీరికి అఖిల్ ఆతిధ్యం ఇవ్వడం ప్రత్యేకత సంతరించుకుంది.

ఇక అఖిల్ బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ చిత్రీకరణ కొనసాగుతుంది. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంత వరకు సరైన హిట్ అందుకోలేదు. నాలుగవ ప్రయత్నంగా చేస్తున్న ఈ చిత్రమైనా ఆయనకు ఓ మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి. ఇక ఈ మూవీలో అఖిల్ కి జంటగా పూజా హెగ్డే ఎంపికయ్యారు. ఇటీవలే ఆమె ఈ మూవీ షెడ్యూల్ కి హాజరుకావడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు