యాక్షన్ మోడ్‌లోకి నాగర్జున

యాక్షన్ మోడ్‌లోకి నాగర్జున

Published on Feb 19, 2020 1:46 PM IST

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇందులో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈమధ్య కాలంలో నాగర్జున చేసిన సినిమాలకు భిన్నంగా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. ఫైట్స్, చేజింగ్స్, సీక్రెట్ ఆపరేషన్ ఇలా చిత్రంలో రెగ్యులర్ ఫైట్ సీన్స్ ఉండనున్నాయి. అందుకే చిత్ర బృందం ప్రత్యేక శ్రద్దతో ఫైట్ సీన్స్ రూపొందిస్తున్నారు.

ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో టీమ్ కీలకమైన పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన హౌస్ సైట్లో ఈ ఫైట్ రూపొందుతోంది. ఇందులో నాగార్జునతో పాటు సయామీ ఖేర్ కూడా పాల్గొంటోంది. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు