కేసీఆర్ ని పరామర్శించిన నాగార్జున

గత కొంత కాలంగా రాజకీయాల్లో బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్ గా ఢిల్లీలో తన కుడి కంటికి ఆపరేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన తొందరగానే కోలుకొని అభిమానంతో చూడటానికి వచ్చిన ప్రముఖులను కలుసుకుంటున్నారు.

కేసీఆర్ ను చూడటానికి రాజకీయ నాయకులు, సినీ తారలు ఆయనను పర్సనల్ గా కలుస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం టాలీవుడ్ సినీ నటుడు అక్కినేని నాగార్జున కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని కొంత సేపు ఆయనతో మాట్లాడారు. ఇక నాగార్జున వెళ్లిన తర్వాత మరికొంతమంది పారిశ్రామిక వేత్తలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యులు కేసీఆర్ ను పరామర్శించారు.

 

Like us on Facebook