తండ్రి సినిమాకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేయనున్న తనయ..?

తండ్రి సినిమాకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేయనున్న తనయ..?

Published on Apr 30, 2016 10:25 PM IST

akshara-haasan
నటనలో, తను ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యాన్ని చూపుతూ అభిమానులను అలరించే నటులలో కమల్ హాసన్ ముందుంటాడు. ఇప్పుడు ఆయన లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో క‌లిసి తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ’శభాష్ నాయుడు’ సినిమాను ప్రఖ్యాత మళయాల దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ ఆయనకు జోడీగా నటిస్తుండగా కమల్ హాసన్ పెద్దకూతురు శృతి హాసన్ సినిమాలో ఆయనకు కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం లభించింది. అదేమిటంటే… కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ఈ సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేయనున్నట్లు సమాచారం. కమల్ హాసన్, సారిక ల రెండో కూతురు అయిన అక్షర ’షమితాబ్’ సినిమాతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసినా అంతకు ముందు ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ఈ ’శభాష్ నాయుడు’ సినిమా ద్వారా కమల్ హాసన్ తన ఇద్దరూ కూతుర్లతో కలిసి సినిమాకు పనిచేసే అరుదైన అవకాశం దొరికినట్టయ్యింది. మే 16 న లాస్ ఎంజిల్స్ లో మొదలవుతున్న ఈ సినిమా దాదాపు ఎనభై శాతం సినిమా అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు