అల్లరి నరేష్, నాని ముఖ్య అథిదులుగా ‘అలా ఎలా?’ ఆడియో..!

అల్లరి నరేష్, నాని ముఖ్య అథిదులుగా ‘అలా ఎలా?’ ఆడియో..!

Published on Jul 28, 2014 5:15 PM IST

ala-ela

అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షాని సాల్మన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘అలా ఎలా?’. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంగళవారం సాయంత్రం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యువ హీరోలు అల్లరి నరేష్, నాని హాజరవుతున్నారు. అందాల ముద్దుగుమ్మలు అంజలి, రెజినా, రకుల్ ప్రీత్ సింగ్ ఈ వేడుకలో సందడి చేయనున్నారు.

‘అలా ఎలా?’ సినిమా ద్వారా అనీష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశోకా క్రియేషన్స్‌ పతాకంపై అశోక్‌వదర్ధన్‌ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను నిర్మించారు. కేరళలో అందమైన లొకేషన్స్ లలో చిత్రీకరించిన పాటలు అద్బుతంగా వచ్చాయని చిత్రబృందం చెప్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు