‘అలా ఎలా?’ ఆడియో రిలీజ్ డేట్..!

‘అలా ఎలా?’ ఆడియో రిలీజ్ డేట్..!

Published on Jul 25, 2014 2:45 AM IST

ala-ela

‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షాని సాల్మన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘అలా ఎలా?’. అనీష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశోకా క్రియేషన్స్‌ పతాకంపై అశోక్‌వదర్ధన్‌ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో జూలై 28న విడుదల అవుతుంది.

రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పాటలను కేరళలో అందమైన లొకేషన్స్ లలో చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 28న ఆడియో విడుదల చేసి, వచ్చేనెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు