ఓవర్సీస్ లో విడుదల కానున్న ‘అలా ఎలా?’

ఓవర్సీస్ లో విడుదల కానున్న ‘అలా ఎలా?’

Published on Dec 18, 2014 2:02 PM IST

Ala-Ela-review1
కంటెంట్ పరంగా పెద్ద సినిమాగా గుర్తింపుతెచ్చుకున్న చిన్న చిత్రం ‘అలా ఎలా?’ ప్రస్తుతం అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా సంతరించుకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ‘అలా ఎలా?’ ని ఓవర్సీస్ లో సైతం ఇప్పుడు విడుదలచేయనున్నారు

తాజా సమాచారం ప్రకారం కామిక్ కేపర్ ఈ చిత్రాన్ని అమెరికాలో 7 స్క్రీన్ లలో విడుదలచేయనున్నారు. ముగ్గురు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని తెరపై వైవిధ్యంగా చూపించిన దర్శకుడు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు

రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, షానిలు నటించిన ఈ సినిమాను అనీష్ కృష్ణ తెరకెక్కించాడు. అశోక్ వర్ధన్ నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు