హారర్ కామెడీ సినిమాగా ‘అలౌకిక’

హారర్ కామెడీ సినిమాగా ‘అలౌకిక’

Published on Oct 21, 2014 5:51 PM IST

Alaukika
మనోజ్ నందం, హరిణి జంటగా చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అలౌకిక’. మణి సమర్పణలో హయగ్రీవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, మదాల రవి, ఉత్తేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది నా రెండో సినిమా. కథపై నమ్మకంతో రామారావు గారు సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. మదాల రవి, ఉత్తేజ్, బ్రహ్మాజీ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

మొదటి నుండి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్న నా కెరీర్ లో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది అని హీరో మనోజ్ నందం అన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కధాంశంతో భానుకిరణ్ సినిమా రూపొందిస్తున్నాడు. హారర్ కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని మదాల రవి అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు