టీజర్ తో యూట్యూబ్ రికార్డ్స్ దుమ్ముదులుపుతున్న బన్నీ

టీజర్ తో యూట్యూబ్ రికార్డ్స్ దుమ్ముదులుపుతున్న బన్నీ

Published on Dec 12, 2019 8:17 AM IST

అభిమానుల ఆసక్తి, అంచనాల మధ్య అలవైకుంఠపురంలో టీజర్ నిన్న విడుదలైంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ తరహా మేనరిజం కలగలిసి టీజర్ అద్భుతంగా కుదిరింది. ఒక నిమిషానికి పైగా ఉన్న ఈ టీజర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ గా సాగింది. ఇక విడుదలైన నిమిషాలలోనే అలవైకుంఠపురంలో టీజర్ రికార్డ్ ల వేట మొదలుపెట్టింది. కేవలం ఏడు నిమిషాలలో వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న అలవైకుంఠపురంలో టీజర్ అత్యంత వేగంగా 5 మిలియన్ వ్యూస్ సాధించిన వీడియోగా యూట్యూబ్ లో రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం అలవైకుంఠపురంలో టీజర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా యంగ్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్యూటీ పూజా హెగ్డే బన్నీ సరసన మరో మారు ఈ చిత్రంలో జతకడుతుంది. టబు, హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు. 2020 జనవరి 12న సంక్రాంతి కానుకగా అలవైకుంఠపురంలో మూవీ విడుదల అవుతుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు