అందరి చూపూ ‘ధృవ’ యూఎస్ ఓపెనింగ్స్ పైనే..!

అందరి చూపూ ‘ధృవ’ యూఎస్ ఓపెనింగ్స్ పైనే..!

Published on Dec 9, 2016 4:29 AM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను అలరించేందుకు ‘ధృవ’ సినిమాతో థియేటర్ల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆటతో సినిమా మొదలవ్వగా, యూఎస్‌లో మాత్రం రాత్రి నుంచే ప్రీమియర్స్ సందడి మొదలైంది. రామ్ చరణ్ స్వయంగా ఈ ప్రీమియర్స్‌కు హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. యూఎస్‌లో పెద్ద హీరోలందరూ సునాయాసంగా చేరుకునే 1 మిలియన్ డాలర్ మార్క్‌ను చరణ్ మాత్రం ఇప్పటికీ అందుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలోనే ‘ధృవ’కు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎలా ఉంటాయి? ప్రీమియర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి? అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ ఈ వీకెండ్ అంతా అక్కడే ప్రమోషన్స్ చేస్తూ ఉండడంతో ఈసారి 1 మిలియన్ పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి చరణ్ ఈ సినిమాతో అయినా 1 మిలియన్ కొడతారో లేదో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు