నేడే ‘కబాలి’ తెలుగు ఆడియో!

నేడే ‘కబాలి’ తెలుగు ఆడియో!

Published on Jun 26, 2016 4:35 PM IST

kabali1
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. సౌతిండియన్ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తమిళ ఆడియో విడుదలై సూపర్ హిట్ కాగా, నేడు హైద్రాబాద్‌లో తెలుగు ఆడియో విడుదల కానుంది. తమిళ వర్షన్ ఆడియో రిలీజ్ పెద్దగా ఆర్భాటాలేవీ లేకుండా జరిపిన టీమ్, తెలుగు ఆడియోను మాత్రం భారీ ఎత్తున చేపట్టాలని ప్లాన్ చేసింది.

ఈ క్రమంలోనే జే.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‍లో ఈ సాయంత్రం ఆడియో విడుదలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఇక ఈ వేడుకకు రజనీ మినహా మిగతా టీమ్ అంతా హాజరుకానున్నట్లు సమాచారం. రజనీ ప్రస్తుతం హాలీడేపై విదేశాల్లో ఉండడంతో ఆయన ఆడియో విడుదలకు రాలేకపోతున్నారని తెలుస్తోంది. తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు. జూలై 15న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు