గ్రాండ్ రిలీజ్ కి సిద్దమైన ‘యమలీల 2’

గ్రాండ్ రిలీజ్ కి సిద్దమైన ‘యమలీల 2’

Published on Nov 27, 2014 8:24 AM IST

yamalila
సూపర్ హిట్ ‘యమలీల’ సినిమాకు సీక్వెల్ గా ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యమలీల 2’. డాక్టర్ కెవి సతీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో దియా నికోలస్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కెవి సతీష్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 500కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఇది సూపర్ హిట్ మూవీ ‘యమలీల’కి సీక్వెల్ అవ్వడమే.

‘యమలీల’లో సత్యనారాయణ యముడిగా కనిపిస్తే ఇందులో కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో కనిపించనున్నాడు. బ్రహ్మానందం చిత్రగుప్తుడి పాత్ర పోషించారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సెన్సార్ నుండి ‘యు/ఏ’ సరిఫికేట్ వచ్చింది. క్రిష్వి ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో యమలోకం కోసం చేసిన విజువల్ ఎఫెక్ట్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ఈ చిత్ర టీం అంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు