హిట్ కాంబినేషన్ లో స్టార్ హీరో మూవీకి రంగం సిద్ధం.

హిట్ కాంబినేషన్ లో స్టార్ హీరో మూవీకి రంగం సిద్ధం.

Published on Oct 17, 2019 4:02 PM IST

కోలీవుడ్ అత్యంత ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇటీవల అమితాబ్ నటించిన హిందీ చిత్రం పింక్ తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వై’ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీలో అజిత్ లాయర్ గా కనిపించగా, దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించాడు. కాగా ఇదే కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

కాగా రేపు ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. పక్కా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ వినోత్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ కోసం అజిత్ పూర్తిగా లుక్ మార్చేయడం విశేషం. ఆయన నీట్ షేవింగ్ తో పాటు, జుట్టుకి రంగేశారు. అలాగే పాత్ర కొరకు బరువు తగ్గడానికి ప్రతిరోజు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకెళ్లనుంది. అజిత్ 60వ చిత్రంగా రానున్న ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు