అల్లరి నరేష్, మంచు విష్ణు కాంబినేషన్ లో మల్టీ స్టారర్?

అల్లరి నరేష్, మంచు విష్ణు కాంబినేషన్ లో మల్టీ స్టారర్?

Published on Dec 27, 2014 9:22 PM IST

Allari-Naresh_Vishnu
మంచు విష్ణు, అల్లరి నరేష్‌ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి ‘డమరుకం’ ఫేం శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్టు ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి ‘అత్తరింటికి దారేది’ వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదు.

ప్రస్తుతానికి మంచు విష్ణు, దేవకట్టా దర్శకత్వంలో తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘అరిమా నంబి’ అనే తమిళ సినిమా రీమేక్‌ లో నటిస్తున్నాడు. అలాగే అల్లరి నరేష్, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘బందిపోటు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది.

విష్ణు, నరేష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. మరి ఈ మల్టీ స్టారర్‌ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు