అల్లరి నరేష్.. తండ్రయ్యాడు..!

అల్లరి నరేష్.. తండ్రయ్యాడు..!

Published on Sep 28, 2016 3:36 PM IST

naresh
హాస్యకథా చిత్రాలతో మెప్పిస్తూ, రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థానాన్ని భర్తీ చేసిన హీరో అల్లరి నరేష్. కెరీర్ పరంగా స్టార్ హీరో అయ్యేందుకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న నరేష్, వ్యక్తిగత జీవితంలో నేటినుంచి ఓ సరికొత్త, బాధ్యతాయుతమైన తండ్రి అనే హోదా పొందారు. తాను ఓ ఆడబిడ్డకు తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

గతేడాది మే నెలలో చెన్నైకి చెందిన విరూపను అల్లరి నరేష్ పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పత్రిలో తమ జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని ఆహ్వానించారు. ఇక తాను తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ ఇలా ప్రకటించాడో లేదో సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులుగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతోన్న నరేష్ దంపతులకు శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు