రాఖీ పండుగ రోజు అల్లరి నరేష్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..

రాఖీ పండుగ రోజు అల్లరి నరేష్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్..

Published on Jul 28, 2014 5:26 PM IST

allari_naresh_karthika

కామెడీ కింగ్ అల్లరి నరేష్, కార్తీక నాయర్ కవలలుగా నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తయింది. ‘వీడు తేడా’ ఫేం చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమ్మిరాజు నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ టైటిల్ ను రాఖీ పౌర్ణమి పండుగ నాడు అనౌన్స్ చేయనున్నారు. ఆగస్ట్ 10న టైటిల్, టైటిల్ లోగో & సినిమా ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. సెప్టెంబర్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు, అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే టైటిల్ సూచించే అరుదైన అవకాశం 123తెలుగు.కామ్ వీక్షకులకు కల్పించిన సంగతి తెలిసిందే. మీ మనసులో టైటిల్ తెలియజేయడానికి క్రిందనున్న లింక్ క్లిక్ చేయండి..

స్పెషల్ కాంటెస్ట్ : అల్లరి నరేష్ సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ మీదే..!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు