ఇంటర్వ్యూ లతో ఆదరగొడతున్న నరేష్

ఇంటర్వ్యూ లతో ఆదరగొడతున్న నరేష్

Published on Aug 1, 2015 11:49 PM IST

allari-naresh
అల్లరి ఈజ్ బ్యాక్ అనే కాన్సెప్ట్ తో గతకొంతకాలంగా హిట్ కోసం పరితపిస్తున్నఅల్లరి నరేష్ ఇటీవలే జేమ్స్ బాండ్ సినిమాతో మనల్ని పలకరించాడు. నేను కాదు నా పెళ్ళాం అన్నది ఉపశీర్షిక. అయితే ఈ చిత్రానికి మిక్సడ్ రివ్యూలు రావడంతో అల్లరి నరేష్ స్వయంగా రంగంలోకి దిగి యావరేజ్ చిత్రాన్ని కాస్తా హిట్ గా మలిచాడు.

కలెక్షన్ల విషయంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా కి సంబంధించి సక్సెస్ టూర్ లంటూ ఊరూరా చుట్టేసాడు. అంతేకాక తనకు దగ్గర స్నేహితులైన నాని, సునీల్ వంటి యువ హీరోలతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ లు చేయించుకుని సినిమా విశేషాలు తెలుపుతున్నాడు. ఈ కొత్త తరహా ప్రయత్నం విజయం సాధించడంతో త్వరలో ఈ ఫార్ములాని మిగిలిన హీరోలు ఫాలో అవ్వచ్చని భావన.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు