హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయనున్న అల్లరి నరేష్ !

హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయనున్న అల్లరి నరేష్ !

Published on Oct 23, 2017 4:27 PM IST


ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా వెలుగొందిన నటుడు అల్లరి నరేష్ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయన చివరి సినిమాలు ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం, మేడ మీద అబ్బాయి’ వంటివి పరాజయం పొందటంతో ఆయనకు హిట్ అత్యవసరమైంది. అందుకే ఆయన తన సక్సెస్ ఫుల్ దర్శకుడిని రిపీట్ చేయాలనే యోచనలో ఉన్నారు. ఆ దర్శకుడే భీమినేని శ్రీనివాస రావ్.

వీరిద్దరూ కలిసి గతంలో చేసిన ‘సుడిగాడు’ మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఆయనతో మరొక సినిమా చేసి పాత సక్సెస్ ను రిపీట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే సినిమాను కూడా ఓకే చేశారని సమాచారం. దీంతో పాటే ఈ. సత్తిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలనున్నాడు నరేష్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు