100వ సినిమా ప్లాన్స్ చెప్పిన అల్లరి నరేష్

100వ సినిమా ప్లాన్స్ చెప్పిన అల్లరి నరేష్

Published on Feb 6, 2016 9:25 AM IST

Allari-naresh
టాలీవుడ్ సోలో కామెడీ హీరో అల్లరి నరేష్ తన చివరి సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’తోనే కదా తన 50వ సినిమాని పూర్తి చేసాడు..ఇంకా 51వ సినిమా రిలీజ్ చేయలేదు, అప్పుడే 100వాక్ ఇనెమా ప్లాన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు చదివింది మేము రాసింది కరెక్టే.. అల్లరి నరేష్ 50 సినిమాలే పూర్తి చేసాడు, అలాగే తను రీసెంట్ గా చెప్పింది కూడా తన 100వ సినిమా గురించే. ఇక సలు విషయంలోకి వెళితే..

భీమవరంలో ప్రతి ఏడు మావూళ్ళమ్మ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది వేడుకలకి అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అక్కడ మావూళ్ళమ్మ ఫెస్టివల్ కమిటీ వారు అల్లరి నరేష్ ని సత్కరించారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నా 100వ సినిమా షూటింగ్ మొత్తం భీమవరంలోనే’ చేస్తాను. అలాగే మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య, ఎస్.వి రంగారావులు నాకు స్ఫూర్తి. గతంలో అలాంటి వారికి సన్మానించిన వేదికపై నాకు ఈ సత్కారం జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు