వర్మ తక్కువ రకం మనిషి – అల్లు అరవింద్

వర్మ తక్కువ రకం మనిషి – అల్లు అరవింద్

Published on Apr 19, 2018 5:36 PM IST

శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ ను అసభ్యకరమైన రీతిలో తిట్టించింది తనేనంటూ, సమస్య అందరి దృష్టిలోకి వెళ్లాలంటే పవన్ ను టార్గెట్ చేయమని ఆమెను ప్రోత్సహించింది తానేనంటూ ఒక వీడియో విడుదలచేసి, ఆ తరవాత అభిమానుల్ని, మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ను పదే పదే క్షమాపణలు కోరి సంచలనం రేకెత్తించాడు వర్మ. ఈ విషయంపై మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో స్పందించారు.

ముందుగా శ్రీరెడ్డి తనచేత ఇదంతా చేయించింది వర్మ అని బయటికి చెప్పేలోపు ఆయనే తప్పుని ఒప్పుకుంటూ వీడియో పెట్టాడని, దీని వెనుక నీచమైన వర్మ అండ్ కో ఉన్నారని అల్లు అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో ఆయన ప్రతిష్టను తగ్గించాలనే ఉద్దేశ్యంతో వెధవ తెలివితేటల్ని ఉపయోగించి వర్మ ఈ తతంగమంతా నడిపాడని, అతను తక్కువ రకం మనిషని విరుచుకుపడ్డారు.

అలాగే వర్మ తనను పైకి తీసుకొచ్చిన తల్లిలాంటి తెలుగు పరిశ్రమకు ద్రోహం చేశాడని, ఇలాంటి నీచుడ్ని ఏం చేస్తారో చెప్పాలని సినీ పెద్దల్ని డిమాండ్ చేస్తున్నానని, పవన్ ఇమేజ్ ను తగ్గించడానికి చేసిన ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో బయటకు చెప్పాలని వర్మను నిలదీశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు