మరోసారి తండ్రైన అల్లు అర్జున్ !

allu-arjun-1
అల్లు అర్జున్ మరోసారి తండ్రయ్యాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అతని భార్య స్నేహ రెడ్డి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2012 లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలకు వివాహం కాగా 2014 లో అయాన్ పుట్టాడు. అల్లు అర్జున్ తనకు పాప పుట్టింది అనే వార్తను ట్విట్టర్ ద్వారా చెప్పగానే ఆయన అభిమానాలు, మెగా అభిమానాలు వార్తను షేర్ చేసుకుంటూ బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ కూడా ‘పాప పుట్టింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇంతకన్నా ఎక్కువ ఏమీ అడగదల్చుకోలేదు. మీ అభినందనలకు చాలా ధ్యాంక్స్’ అన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాన్ని చేస్తున్నాడు.

 

Like us on Facebook