‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్..!

‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్..!

Published on Jul 30, 2014 5:11 PM IST

Allu-Arjun

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథకు కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోన గన్నారెడ్డి పాత్ర కోసం హార్స్ రైడింగ్, కత్తి యుద్ధం వంటి అంశాలలో ట్రైనింగ్ తీసుకున్నాడు. తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అర్జున్ కెరీర్లో గోన గన్నారెడ్డి పాత్ర అత్యుత్తమ పాత్రలలో ఒకటిగా నిలుస్తుందని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. ‘రుద్రమదేవి’ షూటింగ్ కోసం అల్లు అర్జున్ 40 రోజులు కేటాయించాడు. సింగల్ షెడ్యూల్లో తను పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే షెడ్యూల్ కంప్లీట్ అయింది. అల్లు అర్జున్ సరసన అనామికా దేవి పాత్రలో కేథరిన్ నటిస్తుంది.

‘రుద్రమదేవి’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు