ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్ని-బోయపాటి మూవీ

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్ని-బోయపాటి మూవీ

Published on Aug 31, 2015 8:30 AM IST

Allu-arjun-boyapati
ఈ ఏడాది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా మొదతిఒ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. జూలై 29న హైదరాబాద్ లో మొదలైన ఈ ఫస్ట్ షెడ్యూల్ నెలరోజుల పాటు నిరవధికగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పై ఓ కీలక చేజింగ్ సీన్ ని షూట్ చెయ్యడమే కాకుండా హీరోయిన్ కేథరిన్, విలన్ గా కనిపించనున్న ఆది పినిశెట్టి, అల్లు అర్జున్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు.

కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు కానుంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండేలా వినోదం, కుటుంబ విలువలను మిక్స్ చేసి బోయపాటి ఈ సినిమా కథని సిద్దం చేసారు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా సెట్లో జాయిన్ కానుంది. అలాగే ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు