కేరళ బయలుదేరిన బన్నీ..!

కేరళ బయలుదేరిన బన్నీ..!

Published on Apr 21, 2015 11:02 AM IST

Son-of-satyamurty
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొంది ఏప్రిల్ 9న విడుదలైన S/O సత్యమూర్తి.. విడుదలై రెండో వారమైనా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విషయం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా మళయాలంలోనూ విడుదలకు సిద్ధమైంది. S/O సత్యమూర్తి మళయాల వర్షన్ డబ్బింగ్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తి కాగా, ఏప్రిల్ 24న ఈ సినిమా మళయాలంలో భారీ ఎత్తున విడుదల కానుంది.

మళయాల పరిశ్రమలో అల్లు అర్జున్‌కున్న క్రేజ్ ఏ స్థాయిదో తెలిసిందే. తెలుగులో ఏ హీరోకూ లేనంత స్టార్‌డమ్ బన్నీకి మళయాలంలో ఉంది. ఈ క్రేజ్ వల్లే బన్నీ సినిమాలు మళయాలంలోకి డబ్ అయి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడా ఆ కోవలోనే S/O సత్యమూర్తి కూడా మళయాలంలో విడుదల కానుంది. ఈ వారమే సినిమా విడుదలవుతున్నందున అల్లు అర్జున్ నేడు కేరళకు బయలుదేరారు. అక్కడ ఫ్యాన్స్‌తో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సినిమాకు మరింత ప్రచారం కల్పించే దిశగా అడుగులేస్తున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ట్వీట్ చేస్తూ.. “కేరళలో అభిమానులను కలుసుకోవడానికి వెళ్ళడం ఎగ్జైటింగ్‌గా ఉంది” అని తెలిపారు బన్నీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు