పవన్ కళ్యాణ్ ని దాటడానికి ప్రయత్నిస్తున్న బన్నీ

పవన్ కళ్యాణ్ ని దాటడానికి ప్రయత్నిస్తున్న బన్నీ

Published on Apr 1, 2015 12:14 AM IST

Allu-and-Pawan-Kalyan
వెడ్డింగ్ ప్లానర్ గా ఈ వేసవిలో మనల్ని అలరించడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. తన తాజా చిత్రం S/o సత్యమూర్తి సినిమా ఏప్రిల్ 9న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఆడియో విడుదలనాటినుండీ ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయనడంలో సందేహంలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సిద్ధమవ్వమని నిర్మాత తెలిపారు.

శాటిలైట్ ధరలలో, డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయాలలో ఈ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం మొదటి ఆటతో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటే ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా ఓవర్ సీస్ లో అత్తారింటికి దారేది కలెక్షన్లను అధిగమిస్తుందట.

సమంతా, అదా శర్మ, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవి సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు