అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరు ?

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరు ?

Published on Jan 20, 2018 7:34 PM IST

అల్లు అర్జున్ ప్రస్తుతం నాపేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వక్కంతం వంశి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటివల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. ఈ ప్రాజెక్ట్ తరువాత బన్ని ఏ సినిమా చెయ్యబోతున్నడనే సందేహం చాలా మందిలో ఉంది.

తాజా సమాచారం మేరకు వి.ఐ ఆనంద్ బన్ని తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరుకే వీరిద్దరిమద్య కథ చర్చలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విఐ.ఆనంద్ ఈ సినిమకు సంభందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు