అనుష్కపై అల్లు అర్జున్ ప్రశంశల జల్లు @రుద్రమదేవి

అనుష్కపై అల్లు అర్జున్ ప్రశంశల జల్లు @రుద్రమదేవి

Published on Oct 4, 2015 7:01 PM IST

Anushka-Allu-arjun
తెలుగు జాతి ప్రజలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఎంతో సమర్ధవంతంగా పరిపాలించిన కాకతీయ వంశీయులలో వీరణారిగా పేరు తెచ్చుకున్నరుద్రమదేవి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రుద్రమదేవి’. ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ ఫిల్మ్ గా వస్తున్న ఈ ‘రుద్రమదేవి’ టైటిల్ రోల్ లో అనుష్క నటించింది. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమా ఫైనల్ గా అక్టోబర్ 9న రిలీజ్ కానుందని ఇది వరకే తెలియజేశారు. ఈ విషయాన్ని మరోసారి ఈ చిత్ర టీం ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసింది.

అనుష్క, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ మరియు గుణశేఖర్ లు పాలోగొన్న ఈ కార్యక్రమంలో గుణశేఖర్ మాట్లాడుతూ ‘రుద్రమదేవి 100% అక్టోబర్ 9న రిలీజ్ అవుతోంది. ని పనులు పూర్తయ్యాయి. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రం టైం 2 గంటల 37 నిముషాలు. సినిమా అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నానని’ అన్నాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఇలాంటి ఓ సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం తెలుగు తెలుగు నటుడుగా గర్వంగా ఫీఎలవుతున్నాను. ఈ సినిమాకి మెయిన్ హీరో అనుష్క. తను మూడేళ్ళ పాటు ఓ హీరోకంటే ఎక్కువగా కష్టపడి ఈ సినిమా చేసింది. తన డెడికేషన్ కి నా హాట్సాఫ్. అంత డెడికేషన్ నేను ఏ హీరోయిన్ లోనూ చూడలేదని’ అన్నాడు.

మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ అక్టోబర్ 9న తెలుగు, తమిళ్, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు